ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో భారీ సంస్కరణలు..నవంబర్ 1 నుంచి అమలు..!
By న్యూస్‌మీటర్ తెలుగు
- పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్
- నవంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంస్కరణలు అమలు
- అవినీతికి తావులేని కొత్త విధానమన్న ప్రభుత్వం
- నగదు రహిత కార్యకలాపాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం
- ఇప్పటికే కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా సంస్కరణలు అమలు
అమరావతి: వైఎస్ జగన్ పాలన సంస్కరణల్లో స్పీడ్ పెంచారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ప్రక్షాళనకు పీఎం వైఎస్ జగన్ నడుం బిగించారు. అవినీతి ఆరోపణలు, మధ్యవర్తుల కమిషన్లు, ముడుపుల బాగోతాలతో అస్తవ్యస్తంగా వున్న రిజిస్ట్రేషన్స్ శాఖలో సంస్కరణలను ప్రవేశ పెట్టడానికి రంగం సిద్ధం చేశారు. ఇకపై క్రయ, వియక్రయదారులే స్వయంగా డాక్యుమెంట్ తయారు చేసుకోవచ్చు. అంతేకాదు..ఆన్ లైన్‌లో దరఖాస్తూ చేసుకునే అవకాశం కల్పించారు.
రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు వల్ల మరింత పారదర్శకత ఏర్పడుతుందని వైఎస్ జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇక నుంచి రిజిస్ట్రేషన్ రుసుము కూడా ఆన్ లైన్‌లో చెల్లించకోవచ్చు. ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర క్యూలు ఉండవని అధికారులు చెబుతున్నారు. అన్ని రకాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలను వెబ్ సైట్‌లో పొందపర్చారు. 16 నమూన డాక్యుమెంట్లను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు రైటర్లతో పని ఉండదు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో నమునాలు ఉపయోగించుకోవచ్చు. సిద్దం చేసుకున్న మొత్తం డాక్యుమెంట్‌ను ప్రింట్ తీయాలి. . దానితో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాలి. సదరు డాక్యుమెంట్‌ను స్కాన్ చేసి, అధికారులు రిజిస్ర్టేషన్ ప్రక్రియ చేపడుతారు.
కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టారు. అయితే..ఇప్పటికే దీనిలో ఉన్న లోపాలను అధికారులు గుర్తించారు. వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కొత్త రిజిస్ట్రేషన్ విధానంపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీని కోసం రెండు బృందాలు పని చేస్తున్నాయి.
ఈనెల 14వ తేదీన కర్నూలు, విజయనగరం, 15న అనంతపురం, శ్రీకాకుళం, 16న కడప, విశాఖపట్నం, 17న చిత్తూరు, తూర్పు గోదావరి, 18న నెల్లూరు, పశ్చిమ గోదావరి, 19న ప్రకాశం, కృష్ణా, 21వ తేదీన గుంటూరు జిల్లాల్లో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనిలో అన్ని వర్గాల వారి సలహాలు, సూచనలు తీసుకుంటారు.
ఒకవేళ డాక్యుమెంట్లను తిరస్కరించిన అప్పీల్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చట్టం 73, 74 కింద జిల్లా రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కారణాల వల్లనైతే అధికారి డాక్యుమెంట్‌ను తిరస్కరిస్తారో దానికి పూర్తి వివరణ సంబంధిత అధికారి ఇస్తారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పాదదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.