కాలిఫోర్నియా కార్చిచ్చు దెబ్బకు హాలీవుడ్ తారలు పరుగులు..!!

By సత్య ప్రియ  Published on  29 Oct 2019 3:48 PM IST
కాలిఫోర్నియా కార్చిచ్చు దెబ్బకు హాలీవుడ్ తారలు పరుగులు..!!

కాలిఫోర్నియా అడవుల్లో మొదలైన కార్చిచ్చు పెరిగి పెరిగి లాస్ ఏంజిలిస్ ను తాకింది. హాలీవుడ్ సెలెబ్రిటీలు, ప్రముఖులూ ఉండే ప్రపంచంలోనే అత్యంత సపన్న ప్రాంతమైన బ్రెంట్ వుడ్ తో పాటు శివారు ప్రాంతాల్లో అగ్ని వ్యాపించింది.

అనేక విల్లాలు దగ్ధం కావడం, భారీగా అగ్నికీలలు ఎగిసిపడడంతో సెలెబ్రిటిఏలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

Ldn L Getty Fire Rmc 07 2 The Getty fire burns near a home on Tigertail Road in the Brentwood area on Monday, Oct. 28, 2019. (Photo by Rick McClure/Special to the Los Angeles Daily News)

బ్రెంట్ వుడ్ ప్రాంతంలో మిలియన్ల డాలర్లు విలువ గల ఇళ్లు దగ్ధం అయినట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున లిబ్రోన్ జేంస్ ఇంటికి నిప్పు అంటుకోవడంతో తన భార్య, 3 పిల్లలతో కలిసి ఆయన బయటకు పరుగులు తీశారు.

[caption id="attachment_7853" align="alignnone" width="523"]Brush Fire

ప్రముఖ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ స్వార్జెనెగర్ సహా పలువురు హాలీవుడ్ ప్రముఖులు కూడా ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

దావాగ్ని కారణంగా బ్రెంట్ వుడ్ ప్రాంతంలో దట్టమైన పొగ, బూడిద కమ్మేసాయి. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లూ, విమాన ట్యాంకర్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story