ఆస్ట్రేలియాలో ఇసుక తుఫాన్‌ బీభత్సం

By అంజి  Published on  20 Jan 2020 9:35 AM GMT
ఆస్ట్రేలియాలో ఇసుక తుఫాన్‌ బీభత్సం

ఆస్ట్రేలియాలో భారీ ఇసుక తుఫాన్‌ వచ్చింది. సెంట్రల్‌ న్యూ సౌత్‌ వేల్స్‌ అంతటా ఇసుక తుఫాన్‌ అల్లకల్లోలం సృష్టించింది. చిన్నదిగా మొదలైన ఈ తుఫాన్‌.. చిలికి చిలకి పెద్దదిగా మారింది. అక్కడ ఉన్న ఇళ్లు, కొండలు, పొలాలపై దుమ్ము పట్టేసింది. ఉదయం సమయంలో ఇసుక తుఫాన్‌ రావడంతో ఒక్కసారిగా రాత్రిలా మారిపోయి బీభత్సం సృష్టించింది. బ్యూరో ఆఫ్‌ మెట్రోరాలజీ ఆదివారం సాయంత్రం హెచ్చరికలు కూడా జారీ చేసింది.సూర్యుడు కనపడకుండా ఇసుక తుఫాన్‌ నిరోధించింది. ఆకాశాన్ని దుమ్ము, ధూళి కమ్మేసింది. పెద్ద ఎత్తున ఇసుక, దుమ్ము ఇళ్లల్లోకి వచ్చి చేరింది. తీవ్రమైన గాలులు వీయడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అక్కడి చిన్న చిన్న ఇళ్లులు కొట్టుకుపోయాయని సమాచారం. ప్రకృతి ఒక్కసారిగా విలయ తాండవం చేయడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గాలుల్లోకి ఇసుక వచ్చి చేరడంతో రోడ్లపై వాహనాల్లో వెళ్లే వారికి ముందు వెనుక ఏమీ కనిపించలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం ప్రజలకు సూచనలు చేసింది.

Next Story