'హౌడీ మోదీ'పై ప్రశాంత్ కిషోర్‌ ఏమన్నారంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2019 11:18 AM GMT
హౌడీ మోదీపై ప్రశాంత్ కిషోర్‌ ఏమన్నారంటే..?

న్యూఢిల్లీ: ప్రశాంత్ కిషోర్‌..ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. మోదీ మొదటి సారి ప్రధాని కావడానికి ప్రశాంత్ కిషోర్‌ స్ట్రాటజీ కూడా పని చేసిందని చెబుతారు. అటువంటి ప్రశాంత్ కిషోర్‌ 'హౌడీ మోదీ'పై స్పందించారు. 'హౌడీ మోదీ'కి ట్రంప్ హాజరు కావడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్నారు. ట్రంప్, మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ట్రంప్‌ హాజరు కావడం ఆయనకెంతో లాభం చేకూరుస్తుందన్నారు. అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ..ట్రంప్ ప్రవాస భారతీయుల కార్యక్రమానికి హాజరవడం చాలా తెలివైన చర్య అంటూ ప్రశాంత్ కిషోర్ ట్విట్ చేశారు.

Image result for modi trump

ఇక రానున్న అమెరికా ఎన్నికల్లో ప్రవాస భారతీయులకే ఓటు వేయాలని మోదీ హ్యూస్టన్‌లో పిలుపునిచ్చారు. అబ్‌ కీ బార్ ..ట్రంప్ సర్కార్ అని మోదీ పిలుపు నిచ్చారు. దీని అర్ధం ప్రవాస భారతీయులు ట్రంప్ కు ఓటు వేయాలని మోదీ చెప్పకనే చెప్పారని అనుకుంటున్నారు.

Next Story