శానిటైజర్స్ దొరకట్లేదా..అయితే ఇలా తయారు చేసుకోండి

By రాణి  Published on  11 March 2020 11:15 AM GMT
శానిటైజర్స్ దొరకట్లేదా..అయితే ఇలా తయారు చేసుకోండి

కరోనా వైరస్ నేపథ్యంలో ఫేస్ మాస్క్ లు, హ్యాండ్ శానిటైజర్స్ కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోందీ కంటికి కనిపించని శత్రువు. ఈ నేపథ్యంలో ఎక్కడికెళ్లినా చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమం. అలా చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే శానిటైజర్ ను ఖచ్చితంగా వాడి తీరాల్సిందే. కరోనా పుణ్యమా అని మాస్క్ లకు, శానిటైజర్లకు రెక్కలొచ్చాయి. మార్కెట్లో వాటిని కొనుక్కోలేనివారు ఇలా శానిటైజర్ ను ఇంట్లోనే తయారు చేసుకోండి.

Also Read : మునగాకు శృంగారానికే కాదు.. ఆ సమస్యలకు కూడా..

కావలసిన పదార్థాలు :

2/3కప్పు రబ్బింగ్ ఆల్కహాల్ (లేదా వైన్ కూడా తీసుకోవచ్చు)

1/3కప్పు కలబంద గుజ్జు

ఎసెన్షియల్ ఆయిల్

Also Read : డ్రైఫ్రూట్స్ తో అధిక బరువును తగ్గించుకోండిలా..

రబ్బింగ్ ఆల్కహాల్ లేదా వైన్ ను, కలబంద గుజ్జును బాగా కలుపుకోవాలి. అవి రెండూ బాగా కలిసిన తర్వాత ఎసెన్షియల్ ఆయిల్ ఒక్కొక్క చుక్క చొప్పున వేస్తూ..సువాసనొచ్చేంత వరకూ కలుపుకోవాలి. అంతే సింపుల్. ఇప్పుడు హ్యాండ్ శానిటైజర్ రెడీ. ఈ మిశ్రమాన్ని బాటిల్ లో వేసుకుని..మీరు ఎక్కడికెళ్లినా తీసుకెళ్లచ్చు. కానీ..గుర్తుంచుకోండి. హ్యాండ్ శానిటైజర్ తయారీలో ఖచ్చితంగా 60 శాతం ఆల్కహాల్ ఉండాలి.

Next Story