హైదరాబాద్‌: తిరుమలగిరి లోటస్‌ ఆస్పత్రిలో దారుణం వెలుగు చూసింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఓ పేషెంట్ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన దిగారు. మృతురాలిపై ఉన్న ఆభరణాలను ఆసుపత్రి సిబ్బంది దొంగిలించారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు. అయితే ఫీజుల విషయమై ఏమైనా జరిగి ఉంటుందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.