కరోనా కాటుకు బలైన ప్రముఖ నటి

By రాణి  Published on  11 April 2020 3:06 PM GMT
కరోనా కాటుకు బలైన ప్రముఖ నటి

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న..తనకెవరూ స్పెషల్ కాదని చెప్పకనే చెప్తోంది. ధనవంతులైనా, బీదవారైనా కరోనా బారిన పడితే తేరుకోవడం కష్టమేనంటోంది. నిజానికి ధనవంతులే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే విదేశాల నుంచి కరోనాను ఇండియాకు మోసుకొచ్చింది వారే కదా అంటున్నారు స్థానికులు. అమెరికాలో ఇప్పటికే కరోనా సోకి ఇద్దరు సింగర్లు చనిపోయారు. ఇప్పుడు మరో హాలీవుడ్ నటి కరోనా కాటుకు బలయ్యారు.

Also Read : అందరూ లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు..ఆ ఒక్క సీఎం తప్ప..

బ్రిటన్ సైకాలజిస్టు, హాలీవుడ్ నటి హిల్లరీ హీత్ కరోనాతో పోరాటంలో ఓడిపోయారు. 74 ఏళ్ల హిల్లరీ కరోనాతో మృతి చెందినట్లు ఆమె మనుమడు అలెక్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ముఖేల్ రీవ్స్ హార్ర‌ర్ చిత్రం విచ్ ఫైండ‌ర్‌తో హాలీవుడ్ లోకి ప్రవేశించారు. 1960 - 70ల్లో వివిధ సినిమాల్లో నటించిన హిల్లరీ 90 ల్లో సినీ నిర్మాతగా మారి నిల్ బై మౌత్‌, యాన్ ఆవ్‌ఫుల్లీ అడ్వెంచ‌ర్ సినిమాలకు నిర్మాతగా పనిచేశారు.

Next Story