పేరుకే మసాజ్ సెంటర్.. లోపల‌ మొత్తం వ్యభిచారమే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Nov 2019 3:27 PM GMT
పేరుకే మసాజ్ సెంటర్.. లోపల‌ మొత్తం వ్యభిచారమే..!

ఇప్పటికే చాలా చోట్ల ఈ వ్యభిచార కేసులో ఎంతో మంది అరెస్ట్ అయ్యారు. అయినప్పటికి ఇవి ఆగడం లేదు. ఏదో ఒక ప్రాతంలో జరుగుతునే ఉన్నాయి. తాజాగా విజయవాడలో జరుగుతున్న హైటైక్ సెక్స్ రాకెట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

బెజవాడలో స్పాలు, మసాజ్ సెంటర్ల పేర్లతో అమ్మాయిలతో వ్యభిచారం నడిపుతున్నారు. ఈ విషయం తెలుకున్న పోలీసులు ఆ సెంటర్లపై దాదికి దిగారు. ముఖ్యంగా నగరంలోనే బాగా ఖరీదైన భవనాలను రెంట్ కు తీసుకుని స్పా, మసాజ్ సెంటర్లను ఒపెన్ చేస్తున్నారు. నెమ్మదిగా అక్కడే సెక్స్ రాకెట్ ను నిర్వహిస్తున్నారు. పలువురు అమ్మాయిలతో పాటు విటులను.. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

దీనిపై నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. స్పాల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో వెంటనే దాడులు నిర్వహించి పలువురుని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇటువంటి దందాలపై ఉక్కుపాదం మోపుతామని.. ఉపేక్షించబోమని హెచ్చరించారు.

Next Story
Share it