మట్టి పొరల్లో 'మహాభారతం' చరిత్ర

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2019 7:43 AM GMT
మట్టి పొరల్లో మహాభారతం చరిత్ర

ఢిల్లీ: మహాభారత 'చరిత్ర' ఎన్నేళ్ల కిందటిది? ఈ ప్రశ్నకు ఇప్పటిదాకా చెబుతున్న సమాధానం క్రీస్తు పూర్వం 900 నుంచి వెయ్యేళ్ల కిందటిది అని! అయితే, తాజా అంచనాల ప్రకారం అంతకంటే ముందే.. అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 2000 సంవత్సరాల కిందటే మహాభారత యుద్ధం జరిగిందని చరిత్రకారులు అంచనాకు వచ్చారు. భారత పురావస్తు సంస్థ డైరెక్టర్‌ మంజుల్‌ నేతృత్యంలో జరిగిన తవ్వకాల్లో లభించిన వస్తువులను పరిశీలించి ఈ విషయం తేల్చారు.

1951-52లో బీబీలాల్‌ అనే పరిశోధకుడు ఢిల్లీ సమీపంలోని హస్తినాపూర్‌, ఇంద్రప్రస్థ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. అక్కడ లభించిన వస్తువుల ఆధారంగా ..మహాభారతం యుద్ధం క్రీపూ. 900-1000 మధ్య జరిగినట్లు అంచనా వేశారు. గత ఏడాడి మంజుల్‌ బృందం ఢిల్లీకి 68 కిలోమీటర్ల దూరంలోని సనౌలీ ప్రాంతంలో తవ్వకాలు జరిపింది. అశ్వంతో నడిపినట్లుగా భావిస్తున్న రథం, గుర్రాలను అదిలించే కొరడా, పిడి కత్తి, డాలు, బాణం, విల్లు, ఒ శ్మశాన వాటిక, రక్షణ కవచాలు, పతాక ధ్వజం వంటివి లభించాయి. అయితే ఇవ్వన్నీ మహాభారత సంస్కృతికి దగ్గరగా ఉన్నవే అని మంజుల్ తెలిపారు. ఇక్కడ దొరికిన వర్ణమృణ్మయ పాత్రలు, రాగి నాణేలను పరిశీలించిన అనంతరం.. అవి క్రీపూ 2000 సంవత్సరాల నాటివిగా అంచనా వేశారు. దాంతో మహాభారత యుద్ధం క్రీపూ 1500-2000 మధ్య జరిగినట్లుగా అంచనాకు వచ్చారు. అయితే.. ఈ వాదనను బీబీలాల్ మాత్రం తోసిపుచ్చారు. ఇంద్రప్రస్థ, హస్తినాపుర గురించిన ప్రస్తావన 'మహాభారతం'లో ఉందని సనౌలీ గురించి మహాభారతంలో లేనే లేదని తెలిపారు.

Next Story