హిందూపురంలో బాలకృష్ణకు చేదు అనుభవం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Oct 2019 6:26 AM GMT
అనంతపురం: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కు హిందూపురంలో చేదు అనుభవం ఎదురైంది. గలిబిపల్లి గ్రామస్తులు బాలకృష్ణ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. తమ ఊరికి రహదారి ఎందుకు వేయలేదని నిలదీశారు. గ్రామస్తులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక బాలకృష్ణ తడబడ్డారు. తమ గ్రామానికి రోడ్డు వేయకపోవడంపై గలిబిపల్లి గ్రామస్తులు తడబడ్డారు. బాలకృష్ణ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ వైఖరికి నిరసనగా గ్రామస్తులు రోడ్డుపై కూర్చోని నిరసన తెలిపారు.
హిందూపురం నుంచి బాలకృష్ణ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి ఓట్లు వేసి గెలిపించినా తమను బాలకృష్ణ పట్టించుకోకపోవడంపై హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చిపోతే పనులు ఎలా అవుతాయని ప్రశ్నిస్తున్నారు.
Next Story