హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కరోనా వార్తలు..ప్రముఖ ఛానెల్ పై కేసు

By రాణి  Published on  14 April 2020 9:12 PM IST
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కరోనా వార్తలు..ప్రముఖ ఛానెల్ పై కేసు

హిందూ మనోభావాలు దెబ్బతినేలా..ఇస్మార్ట్ న్యూస్ పేరుతో హిందూ దేవతగా కొలిచే అమ్మవారి ముఖచిత్రాన్ని కరోనా గా చూపిస్తూ ఓ ప్రముఖ ఛానెల్ ఇస్మార్ట్ న్యూస్ లో ప్రసారం చేసిందని ఆరోపిస్తూ ఒక అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read : కర్నూల్ లో తొలి కరోనా పేషెంట్ డిశ్చార్జ్..అత్యవసర సేవలు బంద్

వివరాల్లోకి వెళ్తే చంపాపేట్ లో ఉంటున్న అడ్వకేట్ కె. కరుణ సాగర్ (40) ప్రముఖ ఛానెల్ పై సైదాబాద్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆ ఛానెల్ కలియుగ దైవం..కరోనాంబ అమ్మవారంటూ ఓ దేవత ముఖాన్ని కరోనా అమ్మవారుగా మార్చి పరిహాసమాడటం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మత విద్వేష కార్యకలాపాలను ఖండించాల్సిన మీడియానే అలాంటి వాటిని ప్రోత్సహించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ రోజుల్లో టీఆర్పీ కోసం ఛానెళ్లు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదని ఆరోపించారు. దేవతలతో పరిహాసమాడటం చాలా సరదా అయిపోయిందని, దేవత పై పరిహాసం కూడా ఒక వార్త ? అని ప్రశ్నించారు. అసలు దేవత ఫొటోతో ఇలాంటి వాటిని ఇస్మార్ట్ వార్తల పేరిట ప్రసారం చేయడం నేరమన్నారు. చైనా నుంచి ప్రపంచదేశాలకు కరోనా వ్యాపిస్తే..దానిని ఇక్కడి దేవతతో ముడిపెట్టడం ఏ మాత్రం సరైంది కాదన్నారు. కేవలం హిందూత్వం పైనే కాకుండా ఇతర మతాలపై కూడా ఆ ఛానెల్ ఇలాంటి వార్తలను ప్రసారం చేయగలదా ? అని ప్రశ్నించారు. వెంటనే సదరు ఛానెల్ పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read : చదువుకున్న ఆడపిల్లవి..నువ్విలా చేయడం న్యాయమా ? పోలీస్ ప్రశ్న

కాగా ఇప్పటికే ఈ వార్తపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వార్తలను ప్రసారం చేసిన ఛానెల్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story