నాంపల్లి నిలోఫర్ ఆస్పత్రిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. హాస్పిటల్‌లో పార్క్‌ చేసిన కారును తీస్తుండగా, డ్రైవర్‌ లియాకత్‌ఆలీకు ఫీట్స్‌ వచ్చాయి. దీంతో కారు అదుపు తప్పి పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న వైద్యుడు ప్రశాంత్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వైద్యుని ఎడమ చేయి విరగగా, కుడి కాలుకు తీవ్ర గాయమైంది. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పార్కింగ్ వ్యవస్థ లేకపోవడం వల్లే..

ఆస్పత్రిలో పార్కింగ్‌ వ్యవస్థ లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ తెలిపారు. తక్కువ ఛార్జీలతో పార్కింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిత్యం రద్దీగా ఉండే నిలోఫర్‌ హాస్పిటల్‌ ప్రాంగణం.. బుధవారం పెద్దగా జనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.