హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె హైకోర్టులో విచారణ మొదలైంది. ఆర్టీసీ బకాయిలపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. ఆర్టీసీ చెప్పినట్టు ప్రభుత్వం బకాయి లేదని అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. విభజన తర్వాత ఆస్తుల పంపకాలు జరగలేదని కోర్టుకు ప్రభుత్వం నివేదిక అందించింది. 9, 10 షెడ్యూల్‌లోని ఏ కార్పొరేషన్‌ ఆస్తుల విభజన జరగలేదని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాల పునర్విభజన తరువాత ఇంత వరకు ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకాలు ఎందుకు జరగలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశం కేంద్రం పరిధిలో ఉందని కోర్టుకు ఏజీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వాటా రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు రూ.1,009 కోట్లు అని మీరే చెప్తున్నారుగా అని హైకోర్టు ప్రశ్నించింది.

మరో వైపు ఆర్టీసీ సమ్మెపై ఉత్కంఠ నెలకొంది. 25 రోజులుగా ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. రేపు సరూర్‌నగర్‌లో బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

ఆర్టీసీ యూనియన్ల సభకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్

సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహించుకోవడానికి హై కోర్టు అనుమతి ఇచ్చింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.