బీపీ ఎక్కువ ఉందా..? అయితే ఇవి తినాల్సిందే
By సుభాష్ Published on 7 Oct 2020 7:20 PM ISTప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఇబ్బంది పడేది హైబీపీతోనే. ఒత్తిడి, ఆందోళన, గుండె జబ్బులు, మద్యం అతిగా సేవించడం తదితర కారణాల వల్ల చాలా మందికి హైబీపీ వస్తుంటుంది. అయితే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలను ప్రతినిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా హైబీపీ సమస్య నుంచి బయటపడవచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. వారు చెబుతున్న సూచనల ప్రకారం..
► వెల్లుల్లి హైబీపీని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. నిత్యం ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను పచ్చిగా తినడం వల్ల హైబీపీ, కొలెస్టాల్ తగ్గుతాయి. అంతేకాకుండా గుండె సమస్యలు రాకుండా రాకుండా ఉంటాయి.
► దాల్చిన చెక్కలో అనేక ఔషధ గుణాలున్నాయి. దీనిని ప్రతి నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే హైబీపీని తగ్గించుకోవచ్చు. తేనె, దాల్చిన చెక్క పోడిని నిత్యం ఒక టీస్పూను మోతాదులో తీసుకుంటే హైబీపీతో పాటుపీసీవోడీ, డయాబెటిస్ సమస్యలను నుంచి బయటపడవచ్చు
► యాలకులను నిత్యం ఆహారంలో తీసుకుంటే హైబీపీని కంట్రోల్లో పెట్టవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అలాగే వీటిలో ఉండే ఫైబర్ మన శరీరంలోని కొలెస్టాల్‌ను తగ్గిస్తుంది.
► అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి హైబీపీని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఈ గింజల వల్ల ఇతర అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవిసె గింజలను అలాగే తినవచ్చు. లేదా పొడి చేసుకుని మజ్జిగ, ఫూట్ సలాడ్ వంటి వాటిలో కలుపుకొని తినవచ్చు.