పూరి బ‌ర్త్ డేకి రామ్ ఏం గిఫ్ట్ ఇచ్చాడో బ‌య‌ట‌పెట్టిన ఛార్మి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Oct 2019 1:31 PM GMT
పూరి బ‌ర్త్ డేకి రామ్ ఏం గిఫ్ట్ ఇచ్చాడో బ‌య‌ట‌పెట్టిన ఛార్మి

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్.. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో రూపొందిన భారీ చిత్రం 'ఇస్మార్ట్ శంక‌ర్'. ఈ సినిమా రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌డం.. బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డం.. తెలిసిందే. త‌న కెరీర్ లో బెస్ట్ మూవీ ఇచ్చిన డైరెక్ట‌ర్ పూరి అంటే హీరో రామ్‌కి ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఏర్ప‌డింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పుట్టిన‌రో్జున రామ్ ప్ర‌త్యేక‌మైన విషెష్ చెప్ప‌డంతో పాటు ఆయ‌న‌కొక థ్రిల్లింగ్ గిఫ్ట్‌ను పంపాడు.

ఇంత‌కీ ఆ గిఫ్ట్ ఏంటంటే.. గోల్డ్ ఫాంట‌మ్ స్పీక‌ర్‌. వైర్‌లెస్ బెస్ట్ స్పీక‌ర్‌. దీని విలువ మూడు ల‌క్షలు పైగానే ఉంది. ఈ స్పీక‌ర్‌ను బ‌హుమ‌తిగా అందుకున్న పూరి జ‌గ‌న్నాథ్ 'ల‌వ్ యు రామ్' అంటూ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు. ఇస్మార్ట్ శంక‌ర్‌ సినిమాలోని టైటిల్ సాంగ్‌ను వింటూ పూరి ఎంజాయ్ చేసే వీడియో తీసిన చార్మి దాన్ని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.



Next Story