శృతి మించిన‌ ఫోటోల‌తో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది..!

By అంజి  Published on  12 Feb 2020 9:44 AM GMT
శృతి మించిన‌ ఫోటోల‌తో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది..!

త‌న అందాల‌ను ఆర‌బోస్తూ ఫోటోల‌కు ఫోజులివ్వ‌డం ఈ భామ‌కు కొత్తేమి కాదు. కాక‌పోతే ఈ సారి ఇంకాస్త డోస్ పెంచింది. దాంతో త‌న‌లోని శృంగార అప్పీల్ ఇంకొంచెం బ‌హిర్గ‌త‌మైంది. ఆమె మ‌రెవ‌రో కాదు షెర్లిన్ చోప్రా. సుల్ట్రీ షెర్లిన్ టాలీవుడ్‌లో గ‌తంలోవ చ్చిన ఏ ఫిల్మ్ బై అర‌వింద్ చిత్రంలో కీల‌క పాత్ర పోషించింది. కానీ, ఆమెను టాలీవుడ్‌లో ఎక్కువ అవ‌కాశాలు ప‌ల‌క‌రించ‌క‌పోవ‌డంతో మూటా ముల్లు స‌ర్దేసింది.

వెండి తెర త‌న‌కు క‌లిసి రావ‌డం లేద‌ని భావించిన ఈ బ్యూటీ అవ‌కాశాల వేట‌లో భాగంగా త‌నలోని శృంగార అప్పీల్‌ను ప్ర‌ద‌ర్శిస్తూ వీడియోలు చిత్రీక‌ర‌ణ‌, ఫోటోల‌కు ఫోజులిస్తూ వ‌స్తోంది. అయినా, ఏ ఫ్లాట్‌ఫామ్ ఈ భామ ద‌రిచేర‌లేదు. చివ‌ర‌గా ఆమె తన ఫోటోల‌ను, వీడియోల‌ను షేర్ చేసుకునేందుకు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుంది. త‌న‌లోని అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ దిగిన ఫోటోలు, వీడియోల‌ను తెగ షేర్ చేసేస్తోంది.

ఇక అసలు విష‌యానికొస్తే, షెర్లిన్ చోప్రా తాజాగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఒక‌టి వైర‌ల్‌గా మారింది. ఆ ఫోటో త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా త‌న‌ను ఆద‌రించే అభిమానుల‌కు కానుకగా పోస్టు చేసిన‌ట్టు తెలుస్తుంది. అయితే, శృంగార భంగిమ‌లు చూపించ‌డం నేరం కాద‌ని, అది ఒక క‌ళ‌గా పేర్కొంటూ ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో షెర్లిన్ చోప్రా ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it