అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. ‘పెళ్లి సందడి’

By సుభాష్  Published on  27 Oct 2020 7:23 AM GMT
అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. ‘పెళ్లి సందడి’

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.రాఘవేంద్రరావు తెర‌కెక్కించిన రొమాంటిక్ లవ్‌స్టోరి పెళ్లి సంద‌డి. 1996లో విడుద‌లైన ఈ చిత్రం మ్యూజిక‌ల్ బ్లాక్ బాస్ట‌ర్‌గా నిలిచింది. అప్ప‌ట్లో ఈ చిత్రం శ్రీకాంత్ కెరీర్‌ను మ‌లుపు తిప్పింది. ఇదే చిత్రాన్ని హిందీ, త‌మిళ భాష‌ల్లో రీమేక్ చేశారు. అక్క‌డా సూప‌ర్‌హిట్‌గా నిలిచింది.

దాదాపు 25 ఏళ్ల త‌రువాత అదే పేరుతో మ‌రో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు ఇటీవ‌ల రాఘ‌వేంద్ర‌రావు వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించనున్నట్లు ప్రకటించారు. ‘నిర్మలా కాన్వెంట్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ తనయుడు రోషన్ నటనకు సంబంధించిన పూర్తి శిక్షణ తీసుకుని చాలా బాగా మేకోవర్ అయ్యాడు. ‘పెళ్లిసందడి’ లో రోషన్ హీరోగా నటిస్తున్నడని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియో విడుదల చేశారు మేకర్స్. రోషన్ ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందంటూ శ్రీకాంత్ ట్వీట్ చేశారు.

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్రరావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో తెర‌పైకి రానున్న ఈ చిత్రాన్ని గౌరీ రోన‌న్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతోంది. 'పెళ్లిసందడి' పేరుతో త్వ‌ర‌లో తెర‌పైకి రానున్న ఈ చిత్రాన్ని 'బాహుబ‌లి' మేక‌ర్స్ ఆర్కా మీడియాతో క‌లిసి కె. కృష్ణ‌మోహ‌న్ రావు నిర్మించ‌బోతున్నారు. 'పెళ్లిసంద‌డి' మ్యూజిక‌ల్ హిట్‌గా నిల‌వ‌డంతో సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి ఈ సీక్వెల్‌కి కూడా సంగీతం అందించ‌బోతున్నారు. న‌టీన‌టుల, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తి కానున్న ఈ చిత్రాన్నిత్వ‌ర‌లో ప్రారంభించ‌బోతున్నారు. ఈ విష‌యాల్ని సోమ‌వారం చిత్ర బృందం అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది.Next Story