హిందీలోకి మరో సూపర్ హిట్ తెలుగు సినిమా !

By Newsmeter.Network  Published on  29 Dec 2019 3:52 PM GMT
హిందీలోకి  మరో సూపర్ హిట్ తెలుగు సినిమా !

బాలీవుడ్ నిర్మాతల చూపు టాలీవుడ్ సినిమా కథల పై పడింది. ఈ మధ్య ఇక్కడ సూపర్ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు. ఇప్పటికే 'అర్జున్ రెడ్డి' రీమేక్ హిందీలో భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో.. తెలుగులో హిట్ అయిన 'జెర్సీ, ఆర్ఎక్స్100', ఓ బేబీ' చిత్రాల రైట్స్ ను కొనేశారు. అలాగే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ హీరోయిన్ రష్మిక మండన్న జంటగా వచ్చిన 'డియర్ కామ్రేడ్' సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరొక తెలుగు చిత్రాన్ని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా కూడా రీమేక్ అవుతుందట.

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడట. హీరో రామ్ - పూరి జగన్నాథ్ కలయికలో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ సినిమా ఓవర్శిస్ తో పాటు తెలుగు రాష్ట్రాల అన్ని కేంద్రాల్లో భారీ కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఈ సినిమా రెట్టింపు లాభాలనుసొంతం చేసుకుంది. మొత్తానికి, ఇస్మార్ట్ శంకర్ పూరితో పాటు హీరో రామ్ కి కూడా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. మరి ఈ సినిమా రణబీర్ కపూర్ కి కూడా సూపర్ హిట్ ని ఇస్తుందా..? అలాగే రామ్ చేసిన పాత్రలో రణబీర్ కపూర్ ఎలా నటిస్తాడో చూడాలి. మార్చి నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Next Story