ప్రభాస్ ని వెంటాడిన కరోనా భయం

By రాణి  Published on  4 March 2020 8:16 AM GMT
ప్రభాస్ ని వెంటాడిన కరోనా భయం

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ని కూడా కరోనా భయం వెంటాడింది. ప్రభాస్ మౌత్ మాస్క్ వేసుకుని ఎయిర్ పోర్ట్ లోకి వెళ్తున్న వీడియో, ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లో కూడా కరోనా కేసు నమోదవ్వడంతో ప్రభాస్ ముందు జాగ్రత్తగా మాస్క్ ధరించి వెళ్లారు. సినిమా చిత్రీకరణలో భాగంగా ప్రభాస్ బుధవారం ఉదయం యూరప్ వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లేటపుడు ఆయన మాస్క్ ధరించారు. ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం..ఆ వైరస్ కేం తెలుసు అతను సెలబ్రిటీ..అతని వద్దకెళ్లాలంటే అపాయింట్ మెంట్ ఉండాలని. అపాయింట్ మెంట్లు, హద్దులు, ఆంక్షలు మనుషులకే గానీ..రోగాలకు కాదుగా. ప్రస్తుతం ప్రభాస్ రెండు చిత్రాలలో నటిస్తున్నారు. గోపీసుందర్ నిర్మాతగా..యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఈ ఏడాది నవంబర్ 14న విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో చిత్రం కూడా తెరకెక్కనుంది. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నప్పటికీ..ఇప్పటి వరకూ హీరోయిన్ డిసైడ్ అవ్వలేదు. ఈ రెండు చిత్రాలకు ఇంకా టైటిల్స్ ఖరారవ్వలేదు.

కరోనా వైరస్..చైనాను అతలాకుతలం చేసిన ఈ వైరస్ ఇప్పుడు ఒకరకంగా యముడికి ఏజెంట్ గా పనిచేస్తోందనే చెప్పాలి. దీని బారిన పడి బ్రతికిన వారు మాత్రం నిజంగా అదృష్యవంతులే. వైరస్ వస్తే విపరీతమైన జ్వరం, పొడిదగ్గు, జలుబు వంటి లక్షణాలుంటాయని వైద్యులు చెప్పినప్పటికీ..అవన్నీ సాధారణంగా వచ్చే జబ్బులే కాబట్టి ఎవరూ అంత త్వరగా గుర్తించలేకపోతున్నారు. ఆ..జ్వరమేగా అని లైట్ తీసుకుని తర్వాత ఆస్పత్రుల పాలైన వారి సంఖ్య చైనాలో కోకొల్లలు. చైనా కోలుకుంటుందనుకునేలోపే..దక్షిణ కొరియాపై దాడి చేసిందీ కరోనా వైరస్. మొదట చైనాలో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటే..మిగిలిన దేశాల్లో మాత్రం ఒకట్రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఈ కేసుల సంఖ్య పదుల సంఖ్యను దాటేస్తోంది. దుబాయ్, దక్షిణ కొరియా, జపాన్, అమెరికాతో సహా ఇండియా కూడా కరోనా బారిన పడింది. తెలుగు రాష్ర్టాలతో పాటు దేశ రాజధానిలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం..ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

Next Story