వైభవంగా హీరో నితిన్ నిశ్చితార్థం
By రాణి Published on 15 Feb 2020 4:29 PM IST
- ఏప్రిల్ లో నితిన్ వివాహం
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన హీరో నితిన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శనివారం తన ప్రేయసి షాలినీ కందుకూరితో నితిన్ నిశ్చితార్థపు వేడుక సాంప్రదాయంగా, వైభవంగా జరిగింది. అతికొద్ది మంది స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య నితిన్ తనకు కాబోయే భార్య వేలికి ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగేశాడు. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ..ఏప్రిల్ 16వ తేదీన పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం. అయితే..వీరు దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారని, పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా నాలుగేళ్ల వీరి ప్రేమ కథ ఆఖరికి పెళ్లి పీటలెక్కుతోంది. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించడంతో నితిన్ ప్రేమ కథ సుఖాంతమయింది.
ఇటీవలే రష్మికతో కలిసి నటించిన నితిన్ భీష్మ సినిమా మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21వ తేదీన విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సినిమాకు తుది మెరుగులు దిద్దుతున్నారు.