అప్పుడు... నిఖిల్.. బాగా ఏడ్చేసాడు..!
By Newsmeter.Network Published on 28 Nov 2019 10:20 AM GMTయువ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం 'అర్జున్ సురవరం'. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మే నెలలో రిలీజ్ కావాలి కానీ.. అనుకోని కారణాల వలన చాలా సార్లు రిలీజ్ వాయిదా పడింది. ఆఖరికి ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిఖిల్ తన మనసులో మాటలను బయటపెట్టాడు.
అయితే ఈ సినిమా మే నెల నుంచి వాయిదా పడుతుండడంతో బాగా అప్ సెట్ అయ్యానని తెలిపారు. ఎంత అంటే.. చాలా సార్లు ఎందుకిలా జరుగుతుందని ఏడ్చేశానని అన్నారు. ఇప్పుడు ఆ అన్ని అడ్డంకులను దాటుకుని సినిమా రిలీజ్ అవుతుండడం... చిరంజీవి గారు సపోర్ట్ చేయడం.. సినిమా పై ఆడియన్స్ లో మరింత ఇంట్రస్ట్ పెరగడం.. ఇదంతా చాలా ఆనందంగా ఉందని అన్నారు.
తదుపరి చిత్రాల గురించి చెబుతూ...
కార్తికేయ 2 సినిమా చేస్తున్నానని తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించే ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఆతర్వాత మరో సినిమా గీతా ఆర్ట్స్‌లో చేస్తున్నట్లు తెలిపారు. దీనికి వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. వీటితో పాటు 'హనుమాన్' అనే ఓ కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి ఎవరు దర్శకత్వం వహించనున్నారు అనేది త్వరలో చెబుతానన్నారు. ఈ విధంగా మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు నిఖిల్. మరి... 'అర్జున్ సురవరం' నిఖిల్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.. చూడాలి.