కొత్త టెక్నాల‌జీతో హీరో నుంచి గ్లామ‌ర్ సిరీస్‌లో కొత్త మోడ‌ల్ బైక్‌

By సుభాష్  Published on  31 Oct 2020 11:28 AM IST
కొత్త టెక్నాల‌జీతో హీరో నుంచి గ్లామ‌ర్ సిరీస్‌లో కొత్త మోడ‌ల్ బైక్‌

హీరో మోటోకార్ప్‌ మరో కొత్తబైక్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన బైక్‌లలో విజయవంతమైన మోడల్‌గా పేరు తెచ్చుకున్న గ్లామర్‌ సిరీస్‌లో మరో కొత్త వేరియంట్‌ను వినియోగదారులకు పరిచయం చేసింది. గ్లామర్‌ బ్లేజ్‌ పేరుతో వస్తోన్న ఈ కొత్త మోడల్‌ను హీరో సంస్థ తాజాగా ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్‌ షోరూమ్‌లలో గ్లామర్‌ బ్లేజ్‌ లభిస్తుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.72,200 (ఎక్స్‌-షో రూమ్‌). కొత్త వాహనాన్ని హ్యాండిల్‌బార్‌కు యూఎస్‌బీ చార్జర్‌ ఆప్షన్‌ కూడా ఉంది. ఈ కొత్త మోడల్‌ ప్రస్తుతం గ్రే కలర్‌లో లభిస్తుంది.

కాగా, దేశ వ్యాప్తంగా మంచి పేరున్న గ్లామర్‌ మోడల్‌ బైక్‌లు సంస్థ బ్రాండ్‌ విలువను, పనితీరును చూచిస్తాయని హీరో మోటోకార్ప్‌ సేల్స్‌ అండ్‌ ఆఫ్టర్‌సేల్స్‌ హెడ్‌ నవీన్‌ చౌహాన్‌ తెలిపారు. ఇటీవల విడుదల చేసిన కొత్త గ్లామర్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన తెలిపారు. ఇప్పుడు అదే సిరీస్‌లో వస్తోన్న బ్లేజ్‌ ఎడిషన్‌ దేశంలోని యువతను ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. ఈ బైక్‌ యువతను ఆకట్టుకునేలా ఉంటుందన్నారు.

సరికొత్త టెక్నాలజీ..

గ్లామర్‌ బ్లేజ్‌ బైక్‌ 125 సీసీ బీఎస్‌-6 ఇంజన్‌తో లభిస్తుంది. ఎక్స్‌సెన్స్‌ ప్రోగ్రామ్డ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌తో ఇది పని చేస్తుంది. ఈ ఇంజన్‌ 7500 ఆర్‌పీఎం వద్ద 10.7 బీహెచ్‌పీ, 6000 ఆర్‌పీఎం వద్ద 10.6 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆటో సెయిల్‌ టెక్నాలజీతోపాటు హీరో ఐ3 ఎస్‌ టెక్నాలజీ కలిగి ఉండటం ఈ బైక్‌ ప్రత్యేకత.

ఈ బైక్‌లో మరిన్ని ఫీచర్లు

ఈ బైక్‌లో మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. రైడింగ్‌ కంఫర్ట్‌ కోసం ఈ బైక్‌ అదనపు ఫీచర్లను జోడించారు. దీని హ్యాండిల్‌ వద్ద యూఎస్‌బీ ఛార్జింగ్‌ సదుపాయం ఉంటుంది. సైడ్‌-స్టాండ్‌కు ఇండికేటర్‌ ఇచ్చారు. 240 ఎంఎం ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేకులు, 180 ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో నమ్మకమైన మంచి రైడింగ్‌ సదుపాయం ఈ మోడల్‌ బైక్‌కు అందిస్తున్నట్లు హీరో సంస్థ వెల్లడించింది.

Next Story