హీరో నాగార్జున పొలంలో మృతదేహాం..!

హైదరాబాద్ :షాద్ నగర్ మండలం కేశంపేట్ పరిధిలోని హీరో నాగార్జున వ్యవసాయ భూమిలో కుళ్లిన మృతిదేహాం లభ్యమైంది. పాపిరెడ్డి గూడ లో 40 ఎకరాల వ్యవసాయ భూమిని హీరో నాగార్జున కొనుగోలు చేశారు. ఈ నెల పదిన వ్యవసాయ కేత్రంలో నాగార్జున భార్య అమల చెట్టు నాటారు. వ్యవసాయ కేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఎర్పాట్లు చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన నిపుణులను వ్యవసాయ క్షేత్రానికి పంపారు.

పొలంలోని ఒక ప్రాంతంలో వున్న గదిలో కుళ్లిపొయిన మృతిదేహాన్ని నిపుణులు గుర్తించారు.   పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కుళ్లిన మృతిదేహాంకు అక్కడే పొస్టు మార్టమ్ నిర్వహించాలని నిర్ణయించారు. గది సీజ్ చేసి గురువారం అక్కడే పొస్టు మార్టమ్ నిర్వహించనున్నారు. చనిపొయిన వ్యక్తి ఎవరన్న దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు .

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.