ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేష‌న్‌కు 'తిప్పరా మీసం' యూనిట్ సహాయం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 6:47 AM GMT
ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేష‌న్‌కు తిప్పరా మీసం యూనిట్ సహాయం

'ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా'కు 'తిప్పరా మీసం' చిత్ర బృందం రూ. 2 లక్షలు తమ వంతు సాయంగా అందజేసింది. హీరో శ్రీ విష్ణు, దర్శకుడు కృష్ణ విజయ్ .ఎల్, చిత్ర సహనిర్మాత అచ్యుత రామారావు కలిసి.. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎం. చంద్ర శేఖర్‌కు చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ..

జర్నలిస్టుల ఆరోగ్య సంక్షేమానికి కమిటీ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ముందు ముందు ఇదే విధంగా మంచి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కమిటీకి తమ తోడ్పాటు ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు.

Next Story