మేడారానికి హెలికాప్టర్‌ సర్వీసులు

By Newsmeter.Network  Published on  2 Feb 2020 5:19 AM GMT
మేడారానికి హెలికాప్టర్‌ సర్వీసులు

మేడారం జాతరకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌ సేవలు ప్రారంభమయ్యాయి. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సేవలను ఆదివారం బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. టూరిజం ప్యాకేజీ లో భాగంగా.. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి మేడారం, మేడారం నుండి బేగంపేట ఎయిర్ పోర్టు వరకు హెలికాఫ్టర్‌ సర్వీసులను నిర్వహిస్తున్నామన్నారు

హైదరాబాద్ నుండి ఆరుగురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలతో పాటు జీఎస్టీ ఉంటుందన్నారు. వీరికి సమ్మక్క, సారలమ్మ దర్శనం కూడా కల్పిస్తామని తెలిపారు. మేడారం జాతరను హెలికాప్టర్‌ ద్వారా తిలకించేందుకు రూ.2999 అదనంగా చెల్లించాలన్నారు. పర్యాటకులు ఈ సదుపాయన్ని ఉపయోగించుకునేందు 9400399999 నంబర్‌ను సంప్రదించాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు. తెలంగాణలోని ప్రాంతాలను ప్రపంచానికి చూపిస్తామని, ఇప్పటికే ప్రసిద్ద రామప్ప దేవాలయం యునెస్కో బృంద పరిశీలనలో ఉందని శ్రీనివాస్‌ గౌడ్ తెలిపారు.

Next Story