అమెజాన్‌లో ఈ ఫోన్‌ ధర భారీగా తగ్గింది

By సుభాష్  Published on  1 Jan 2020 3:41 PM GMT
అమెజాన్‌లో ఈ ఫోన్‌ ధర భారీగా తగ్గింది

ఇప్పుడున్న రోజుల్లో మొబైల్‌ ఫోన్‌లేనివారంటూ ఉండరు. ఎటుచూసిన ఫోన్‌లదే హవా కొనసాగుతుంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు అమెజాన్‌, ప్లిప్‌కార్టు వంటి సంస్థలు భారీ ఆఫర్లు ఇస్తోంది. తాజాగా 'నోకియా 4.2 స్మార్ట్‌ ఫోన్‌ ధర భారీగా తగ్గించింది అమెజాన్‌. ఇక అమెజాన్‌ వెబ్‌సైట్లో ప్రస్తుతం ఈ ఫోన్‌ధర రూ. 6,975 లభ్యమవుతోంది. ఆరంభ ధరతో పోల్చుకుంటే ఈ మొబైల్‌ 36 శాతం వరకు తగ్గించింది. నోకియా బ్రాండ్‌ మొబైళ్లను హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ ఈ ఫోన్‌ ను గత ఏడాది మే నెలలో భారత్‌ లోకి ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌ ఫోన్‌ రూ.10,990 కాగా, తరవాత రూ. 9,499కు తగ్గించగా, ప్రస్తుతం రూ. 6,975 ఉంది.

5.71 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉండగా, 13 మెగాపిక్సల్‌ ప్రైమరీ సెన్సార్‌ కెమెరా, 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే ర్యామ్‌ 3జీబీ, బ్యాటరీ 3000 ఎంఏహెచ్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి.

Next Story