బీపీ నియంత్రణకు ఇవి పాటిస్తే చాలు: డబ్ల్యూహెచ్‌వో
ప్రస్తుతం చాలా మంది బీపీతో బాధపడుతున్నారు.
By Srikanth Gundamalla Published on 7 July 2024 1:30 PM ISTపీ నియంత్రణకు ఇవి పాటిస్తే చాలు: డబ్ల్యూహెచ్‌వో
ప్రస్తుతం చాలా మంది బీపీతో బాధపడుతున్నారు. దీన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి కొందరు టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే.. ఈ సైలెంట్ కిల్లర్‌ను నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సూచనలు చేస్తోంది. బీపీ అనేది బయటకు కనిపించకుండా అంతర్గత అవయవాలను దెబ్బ తీస్తుంది కాబట్టి.. బీపీ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని సూచిస్తోంది.
సర్వేల ప్రకారం ప్రపంచంలో ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు బీపీ బాధితులుగా ఉన్నారని పేర్కొంది. బయటకు ఎలాంటి సూచనలు కనపడకోయినా.. గుండె, మెదడు, కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుందని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు చెప్పారు. చాలా మంది ప్రపంచంలో బీపీతో బాధపడుతున్నారని చెప్పారు. దీని నియంత్రణకు చర్యలు తీసుకోవాలని.. చాలా ఈజీగానే ఉంటాయని అంటున్నారు. తరచూ బీపీ పరీక్ష చేయించుకుంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బీపీని కంట్రోల్‌లో ఉంచవచ్చని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.
వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత బీపీ ఉందని తేలితే కంగారుపడొద్దని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. బీపీని కంట్రోల్‌లో ఉంచుకునేందుకు ముఖ్యమైన ఈ నాలుగు ఆరోగ్య సూత్రాలను పాటించాలని చెబుతోంది. బీపీ బాధితులకు స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే స్వస్తి పలకాలని చెప్పింది. అలాగే రోజూవారీ ఆహారంలో ఉప్పును తగ్గించుకోవాలనీ.. రాత్రి వేళ కంటినిండా నిద్ర పోవాలని చెప్పింది. నిత్య జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది. తద్వారా బీపీ కంట్రోల్‌లో ఉండి.. ఆరోగ్యంగా ఉండొచ్చని పేర్కొంది.