డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవాలంటే ఇవి తాగితే చాలు..!
దేశవ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 7:19 AM GMTడెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవాలంటే ఇవి తాగితే చాలు..!
దేశవ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వర్షాకాలం తర్వాత ఈ డెంగ్యూ వ్యాధి చాలా మందిని ఎటాక్ చేస్తుంది. ప్రతి 10 మందిలో ఆరుగురు ఈ జ్వరంతో బాధపడుతున్నారు. అయితే.. ఇంత వరకు ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే తగ్గే వరకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ డెంగ్యూ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాధి లక్షణాలు, నివారణ, చికిత్స గురించి అవగాహన పెంచుకోవాలి.
డెంగ్యూ అనేది వైరల్ ఇన్‌ఫెక్షన్. గత రెండు నెలలుగా ప్రజల్లో మలేరియా, లెప్టోస్పిరోసిస్, కామెర్లు వంటి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వీటి లక్షణాలు జ్వరం ఉండటం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు, విరేచనాలు, వాంతులు, దగ్గు, వాసన, రుచి లేకపోవడం, గొంతు నొప్పు వంటివి ఉంటాయి. ఇలాంటి లక్షణాలే ఎక్కువ మందిని బాధిస్తున్నాయి. ఇలా బాధపడేవారు డెంగ్యూ బారిన పడినట్లే. అయితే.. డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవాలంటే మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. అంతేకాదు.. పరిశుభ్రంగా ఉండటం, హైడ్రేట్‌గా ఉండటం చాలా ముఖ్యం. అందుకే కొన్ని రిక్వైర్‌మెంట్ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా డెంగ్యూ వ్యాధి నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం...
పసుపు: ఇది అందరి ఇళ్లలోనూ ఉంటుంది. అంతేకాదు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇదొక యాంటీబయోటిక్. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే.. పసుపుని ప్రతిరోజు రాత్రి గోరువెచ్చని పాలలో చిటికెడు వేసుకుని కలిపి తాడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా డెంగ్యూ నుంచి కూడా త్వరగా కోలుకునే చాన్స్ ఉంటుంది.
పండ్ల రసాలు: పండ్ల రసాల్లో చాలా విటమిన్స్ ఉంటాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. మఖ్యంగా నారింజ, నిమ్మ, బొప్పాయి వంటి విటమిన్ సీ అధికంగా ఉన్న పండ్ల రసాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగుతుంది.
అలోవెరా జ్యూస్: డెంగ్యూ జ్వరం త్వరగా పోవాలంటే రోగ నిరోధక శక్తి చాలా అవసరం. అందుకు రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉన్న కలబంద రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది.
అయితే..డెంగ్యూతో బాధపడుతున్న సమయంలో టీ, కాఫీ, ఆల్కహాల్, శీతల పానీయాలతో పాటు అధిక చక్కెర కంటెంట్ ఉండే వాటికి దూరంగా ఉంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.