వెల్లుల్లితో అద్భుత ప్రయోజనాలు..!

By సుభాష్  Published on  14 Sep 2020 11:04 AM GMT
వెల్లుల్లితో అద్భుత ప్రయోజనాలు..!

ఇప్పుడున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య ఎక్కువైపోతోంది. రోజువారిగా పని ఒత్తిడి, టెన్షన్‌, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి ఇలా రకరకాల కారణాల వల్ల జబ్బుల బారిన పడుతున్నారు. కానీ అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలను పాటిస్తే ఎంతో మేలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా వెల్లుల్లితో ఎన్నో ఉపయోగాలున్నాయి. వెల్లుల్లి ప్రతి ఇంట్లో ఉండేదే. దీనిని తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి గట్టెక్కవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వారు తెలిపిన సూచనల ప్రకారం..

గుండె సమస్యలకు చెక్‌

వెల్లుల్లు గుండె సమస్యలకు చెక్‌ పెడుతుంది. శరీరంలో వ్యర్థపదార్థాలను పోగొట్టే గుణాలు చాలా ఉన్నాయి. శరీరానికి మేలు చేసే హెచ్‌డీఎల్‌ కొలెస్టాల్‌ను పెంచడమే కాకుండా శరీరానికి హానీ కలిగించే ఎల్‌డీఎల్‌ కొలెస్టాల్‌ను పెంచడమే కాకుండా శరీరానికి హాని కలిగించే ఎల్‌డీఎల్‌ కొలెస్టాల్‌ను కరిగిస్తుంది. వెల్లుల్లి వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ.

పక్ష వాతానికి ..

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మీక్రిములను చంపే యాంటి మైక్రోబయల్‌, విష పదార్థాలను బయటకు పంపే యాంటి సెప్టిక్‌ గుణాలు దాగివున్నాయి. వెల్లుల్లిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల హైపర్‌ టెన్షన్‌, ఇతర సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా వెల్లుల్లిని ఎక్కువగా తీసుకునేవారు పక్షవాతం బారిన పడకుండా ఉంటారు. తాజాగా దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడంతో ఆశ్చర్యపోయే నిజాలు వెలుగు చూశాయి. వీటిని పచ్చిగా తినేవారికి మంచి ఉపయోగం ఉంటుందట.

కొవ్వును కరిగిస్తుంది

వెల్లుల్లి శరీరంలో ఉన్న కొవ్వును సైతం కరిగిస్తుంది. మెటబాలిజం పెంచుతుంది. అంతేకాకుండా జీర్ణ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. దీని వల్ల బరువు కూడా తగ్గిపోతారు. బరువు తగ్గాలనుకునే వారికి ఉదయం పూట పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

షుగర్‌ వ్యాధి ఉన్నవారికి..

ఈ కాలంలో షుగర్‌ వ్యాధి ఉన్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మధుమేహం అనేది సహజంగా మారిపోయింది. ప్రతి రోజు వెల్లుల్లిని ఆహారంలో తీసుకుంటే షుగర్‌ కంట్రోల్లో ఉంటుందని చెబుతున్నారు.

మతిమరుపునకు వెల్లుల్లు

వెల్లుల్లు తినడం వల్ల మరో మంచి ప్రయోజనం కూడా ఉంది. ఇది తినడం వల్ల మెదడుకు ఆక్సీజన్‌ సరఫరా అయి మెదడు చురుకుగా పని చేస్తుంది. అంతేకాదు మతిమరుపుతో బాధపడేవారికి మంచి ఉపయోగం. మతిమరుపునకు కారణమయ్యే అల్జీమర్స్‌ వ్యాధి రాకుండా ఉపయోగపడుతుంది. ఇలా వెల్లుల్లి వల్ల ఎన్నో లాభాలున్నాయి. తినేటప్పుడు కొద్దిగా ఘాటుగా ఉన్నా.. మంచి లాభాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Next Story