సిద్దిపేట్: కేసీఆర్‌ ఫాం హౌజ్‌లో వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. AK 47తో కాల్చుకుని వెంకటేశ్వర్లు ప్రాణాలు తీసుకున్నాడు. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుది నల్లగొండ జిల్లా వలిగొండగా గుర్తించారు. సీఎం కేసీఆర్ ఫాం హౌజ్‌లో సౌత్ గేట్ దగ్గర వెంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర్లుది 12th బెటాలియన్. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది తెలియరావడం లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

వెంకటేశ్వర్లుది 2003 బ్యాచ్.   కుటుంబ సమస్యలతో వెంకటేశ్వర్లు బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.  కొన్ని రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లాడు. రెండ్రోజుల క్రితమే విధుల్లో చేరుతున్నట్లు హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేశాడు. ప్రస్తుతం ఎర్రవల్లిలోని  కేసీఆర్ ఫాం హౌజ్‌లో పని చేస్తున్నాడు. వెంకటేశ్వర్లు బార్య పేరు శోభ.

జోయల్ డేవిస్ , సీపీ సిద్దిపేట
పోలీసులు చెప్పిన దాని ప్రకారం హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మద్యం మత్తులో ఉన్నాడు. కొంతకాలంగా వెంకటేశ్వర్లు విధులకు హాజరు కాలేదు. భార్య విజ్ఞప్తితో తిరిగి విధుల్లో చేరాడు. హెడ్ గార్డ్‌గా వెంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.