వినాయ‌క్ మూవీలో విల‌న్ ఇత‌నే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2019 11:30 AM GMT
వినాయ‌క్ మూవీలో విల‌న్ ఇత‌నే..!

మాస్ మూవీస్ తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయక్. ఖైదీ నెం 150 త‌ర్వాత ఇంటిలిజెంట్ అనే సినిమాని తెర‌కెక్కించిన‌ప్ప‌టికీ.. స‌క్స‌స్ సాధించ‌లేదు. అయితే... ఇన్నాళ్లు డైరెక్ట‌ర్ గా ఆక‌ట్టుకున్న వినాయ‌క్ హీరోగా 'సీన‌య్య' అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు నిర్మిస్తున్నారు. గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో వ‌ర్క్ చేసిన న‌ర‌సింహారావు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఈ సినిమాలో వినాయక్‌కు విల‌న్ కి టాలీవుడ్‌ యంగ్ హీరో నటించనున్నాడు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత విలన్‌గా, సపొర్టింగ్‌ రోల్స్‌లోనూ ఆకట్టుకుంటున్న నవీన్‌ చంద్ర ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నాడని తెలిసింది.

వినాయక్‌ మెకానిక్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కమర్షియల్ సినిమా తరహా యాక్షన్‌, బిల్డప్‌ సీన్స్‌ పెద్దగా లేవని సమాచారం. కాగా..ఎమోషనల్‌ డ్రామాగా రూపొందుతోన్న‌ ఈ సినిమా పై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. మ‌రి.. డైరెక్ట‌ర్ గా స‌క్స‌స్ సాధించిన వినాయ‌క్, యాక్ట‌ర్ గా ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడు..? బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంద‌డి చేస్తాడు ...? అనేది చూడాలి.

Next Story
Share it