మ‌హేష్ కొత్త సాంగ్ ఎలా ఉందంటే.?

By Newsmeter.Network  Published on  17 Dec 2019 4:00 AM GMT
మ‌హేష్ కొత్త సాంగ్ ఎలా ఉందంటే.?

సూపర్‌స్టార్‌ మహేష్ లేటెస్ట్ మూవీ స‌రిలేరు నీకెవ్వ‌రు. ఈ చిత్రాన్ని సక్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నారు. అభిరుచి గ‌ల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై నిర్మిస్తున్నారు. అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్ అయిన ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న‌ రష్మిక మందన్న న‌టిస్తుంది. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు.

అంద‌రూ ఎంత‌గానో ఎదురు చూస్తున్న రొమాంటిక్ సాంగ్‌ హీ ఈజ్ సో క్యూట్ హీ ఈజ్ సో హాట్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. హీ ఈజ్ సో క్యూట్..హీ ఈజ్ సో స్వీట్..హీ ఈజ్ సో హ్యాండ్సమ్..అంటూ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ గ్లామ‌ర్‌ను పొగిడే ఈ పాట సినిమాలో హీరోయిన్ మనసుని దోచుకున్నాడు కధానాయకుడు అనే సందర్భంలో వచ్చే ఫన్ సాంగ్. రష్మిక, మహేష్ ఒకరినొకరు ఆటపట్టిస్తూ సాగే ఈ రొమాంటిక్ పాటకి శ్రీమణి అర్ద‌వంత‌మైన‌ సాహిత్యం అందిచ‌గా సింగర్ మధుప్రియ చ‌క్క‌గా ఆలపించారు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ ని కంపోజ్ చేశారు. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ తో తన అభిమానులతో పాటు మహేష్ ఫ్యాన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంది రష్మిక. వ‌రుస‌గా సాంగ్స్ రిలీజ్ చేస్తూ... ఆ సాంగ్స్ తో ఆక‌ట్టుకుంటూ సినిమా పై అంచ‌నాల‌ను పెంచేస్తున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు.

Next Story