ఐసోలేషన్‌ సెంట‌ర్‌గా ఉప్పల్ స్టేడియం.. !

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2020 11:45 AM GMT
ఐసోలేషన్‌ సెంట‌ర్‌గా ఉప్పల్ స్టేడియం.. !

క‌రోనా వైర‌స్(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి రోజు రోజుకు వేగంగా విస్త‌రిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి ఇప్ప‌టికే దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను విధించిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికి క‌రోన పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. దేశ వ్యాప్తంగా 600పైగా క‌రోన పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 12మంది మృత్యువాత ప‌డ్డారు. తెలంగాణ రాష్ట్రంలో 41 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

క‌రోనా వైర‌స్ విజృంభిస్తుండ‌డంతో అనేక ర‌కాలుగా సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కోల్‌క‌తాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్ స్టేడియంలో క్వారంటైన్ స‌దుపాయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ సంఘం కూడా ఇదే విధంగా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం కావాలనుకుంటే ఉప్పల్ స్టేడియంలో క్వారంటైన్‌ సేవలు కల్పిస్తామని ఈ సందర్భంగా హెచ్‌సీఏ కార్యదర్శి విజ‌యానంద్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ తరఫున ఈ లేఖ రాసినట్టు ఆయ‌న తెలిపారు.

వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడేలా స్టేడియంలో 40 పెద్ద గదులు ఉన్నాయని, అతి పెద్ద పార్కింగ్‌ సదుపాయం ఉండటం వల్ల కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని హెచ్‌సీఏ పేర్కొంది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో సామాజిక బాధ్యతగా తాము స్టేడియాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చామని అసోసియేషన్‌ స్పష్టం చేసింది.

Next Story