మాస్క్ లు ఓకే గానీ..హెల్మెట్లు ఎందుకు ధరించరు ?

By రాణి  Published on  5 March 2020 9:03 AM GMT
మాస్క్ లు ఓకే గానీ..హెల్మెట్లు ఎందుకు ధరించరు ?

కరోనా వైరస్ పుణ్యమా అని మెడికల్ షాపుల వాళ్ల జేబులు నిండుతున్నాయి. ఎందుకు ? ఇంకా కరోనాకు మందు కనిపెట్టలేదు కదా అని ఆలోచించకండి. దానికన్నా ముందు..మౌత్ మాస్క్ లు వేసుకుంటే కరోనా సోకకుండా ఉంటుందని సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం జరుగుతోంది కదా. ఒక్క సోషల్ మీడియా ఏంటి..అన్నీ తెలిసిన మీడియా కూడా ఇదే చెప్తోంది. ఎటొచ్చి..లాభం పొందుతున్నది మెడికల్ షాపు వాడే కదా. తమ షాపుల్లోనే పలానా మెడిసిన్ కొనాలంటూ ఎలాంటి యాడ్స్ లేకుండా లాభాలు పొందుతున్నారు.

అందులోనూ దొరికిందే సందు అన్నట్లుగా..రూ.20 లకు వచ్చే మాస్క్ లను రూ.200లకు కూడా అమ్ముతున్నారు. అలాగే రూ.40 -రూ.70 లకు లభించే మాస్క్ లను ఏకంగా రూ.400-రూ.700 వరకూ అమ్ముతున్నారు. ఇలా ప్రజల అవసరాన్ని మెడికల్ షాపులు సొమ్ముచేసుకుంటున్నాయి. మెడికల్ షాపుల్లో ఉన్న మాస్క్ లన్నీ అయిపోయాయంటే..ఈ మాస్క్ లకు ఎంత గిరాకీ ఏర్పడిందో అంచనా వేయొచ్చు.

ఇలా కరోనా ప్రభావంతో..జనాలు మాస్క్ లను కొనడం గ్రహించిన హర్యానా ఐపీఎస్ అధికారి పంకజ్ నయన్ ఒక ట్వీట్ చేశారు. ఇండియాలో ఇలా ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైందో లేదో..ప్రజలు అప్పుడే మాస్క్ కొనుక్కుని ముఖానికి తగిలించేసుకుంటున్నారు. అంత గిరాకీ ఏర్పడింది. కానీ..నిత్యం ఏదొక చోట జరిగే రోడ్డు ప్రమాదాల్లో వందల మంది ప్రాణాలు కోల్పోతుంటే..ఇప్పటి వరకూ హెల్మెట్లకు ఎందుకింత గిరాకీ ఏర్పడలేదని పేర్కొంటూ..ఆలోచిస్తున్నట్లున్న ఎమోజీని పోస్ట్ చేశారు. వైరస్ సోకకుండా మాస్క్ లు వేసుకోవడం ఎంత ముఖ్యమో..రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు మృత్యువు నుంచి కాపాడుకోవడం కోసం హెల్మెట్ ను ధరించడం కూడా అంతే ముఖ్యమని హితవు పలికారు.



ఇలా పంకజ్ చేసిన ట్వీట్..నెటిజన్లను మేల్కొలిపింది. నిజమే సార్ అంటూ..రీట్వీట్లు చేస్తున్నారు. ఒకరైతే..ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఇప్పటికీ సరైన రోడ్లు లేవని జవాబిచ్చారు.

Next Story