కనికా కపూర్ పై ఆగ్రహం చెందిన హర్షాభోగ్లే

By Newsmeter.Network  Published on  22 March 2020 4:45 PM IST
కనికా కపూర్ పై ఆగ్రహం చెందిన హర్షాభోగ్లే

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు ఇటీవలే కరోనా నిర్థారణైన సంగతి తెలిసిందే. కానీ..ఈమె కారణంగా చాలా మందికి కరోనా సోకే అవకాశముందని వచ్చిన వార్తలపై ఇప్పుడు ప్రముఖులు మండిపడుతున్నారు. విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్ లో ఉండకుండా ఓ ఫంక్షన్ కు హాజరైంది. అదే కార్యక్రమానికి చాలామంది రాజకీయ ప్రముఖలు కూడా హాజరయ్యారు. ఇప్పుడు వారంతా కూడా ఒక్కొక్కరిగా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఎందుకైనా మంచిదని వారంతా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఇప్పుడీ సింగర్ చేసిన పనికి ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ క్రికెట్ కామెంటర్ హర్షాభోగ్లే కూడా కనికా పై నిప్పులు చెరిగారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తుంటే..చదువుకున్న మూర్ఖులు విదేశాల నుంచి వచ్చి..క్వారంటైన్ లో ఉండకుండా పబ్ లు, పార్టీలంటూ తిరగడం ఏమిటని ప్రశ్నించారు. చాలా మంది వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నా..ఇలాంటి వారి వల్ల వైరస్ వ్యాపిస్తూనే ఉందన్నారు. ఏదేమైనా సర్వజన కృషితోనే వైరస్ ను కట్టడి చేయగలమంటూ హర్షా భోగ్లే ట్వీట్ చేశారు.



Next Story