పూరి నిర్ణ‌యంతో షాకైన హ‌రీష్ శంక‌ర్. ఇంత‌కీ... పూరి ఏం చేశారు.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2019 6:35 AM GMT
పూరి నిర్ణ‌యంతో షాకైన హ‌రీష్ శంక‌ర్. ఇంత‌కీ... పూరి ఏం చేశారు.?

పూరి నిర్ణ‌యంతో షాకైన హ‌రీష్ శంక‌ర్ అన‌గానే... ఇంత‌కీ పూరి ఏ నిర్ణ‌యం తీసుకున్నారు..? దీనికి హ‌రీష్ శంక‌ర్ షాక్ అవ్వ‌డం ఏంటి.? అనుకుంటున్నారా..? విష‌యం ఏంటంటే... వ‌రుస ఫ్లాప్స్ తో స‌త‌మ‌త‌మైన పూరి... ఇటీవ‌ల ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. ఎన‌ర్జిటిక్ యంగ్‌మెన్‌ రామ్ హీరోగా పూరి, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. రూ.75 కోట్ల వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి.. పూరి, రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే... డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించిన తాజా చిత్రం గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్. మెగా హీరో వ‌రుణ్ తేజ్ - పూజా హేగ్డే కాంబినేష‌న్ లో రూపొందిన ఈ భారీ చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. సెకండ్ వీక్ స‌రైన సినిమా లేక‌పోవ‌డంతో 'గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్' బాక్సాఫీస్ వ‌ద్ద మ‌రింత‌గా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం ఖాయం అనుకున్నారు. అయితే... ఊహించ‌ని విధంగా పూరి.. హ‌రీష్ శంక‌ర్ కి షాక్ ఇచ్చాడు.

ఇంత‌కీ ఏం చేసాడంటే.. ఈ నెల 28న డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'ఇస్మార్ట్ శంక‌ర్' మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్ర‌క‌టించారు. ఇది 'గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్' కి దెబ్బే. ఎందుకంటే.. ఇప్పుడు మార్కెట్ లో మాస్ సినిమాలు లేవు. ఉన్న‌ది 'గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్' సినిమానే. దీనికి పోటీగా 'ఇస్మార్ట్ శంక‌ర్' రిలీజ్ చేస్తుండ‌డంతో హ‌రీష్ శంక‌ర్ షాక్ అయ్యాడ‌ట‌. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సెంట‌ర్స్ లో 'ఇస్మార్ట్ శంక‌ర్' ని రిలీజ్ చేస్తున్నారు. మ‌రి... 'గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్' క‌లెక్ష‌న్స్ పై 'ఇస్మార్ట్ శంక‌ర్' ప్ర‌భావం ఎంత ఉంటుందో..? రీ రిలీజ్ లో 'ఇస్మార్ట్ శంక‌ర్' ఎంత క‌లెక్ట్ చేస్తాడని ఆస‌క్తిగా మారింది.

Next Story
Share it