దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హ‌త్య‌ కేసు నిందితులను పోలీసులు శుక్రవారం ఎన్‌కౌంటర్‌ చేశారు. దిశ అత్యాచారానికి గురైన ప్రాంతం తొండుపల్లి టోల్‌ప్లాజా సర్వీసు రోడ్డు నుంచి పెట్రోల్, డీజిల్‌ పోసి మృతదేహాన్ని కాల్చిన చటాన్‌పల్లి అండర్‌పాస్‌ ప్రాంతంలో క్రైమ్‌ సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా ఒక్క‌సారిగా పోలీసుల‌పై రాళ్లు రువ్వుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆత్మ‌ర‌క్ష‌ణ‌పై కాల్పులు జ‌రిపిన పోలీసులు నిందితుల‌ను మ‌ట్టుబెట్టారు.

ఈ ఘ‌ట‌న‌పై టాలీవుడ్ డైరెక్ట‌ర్ హరీశ్‌ శంకర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలియ‌జేశాడు. మా సినిమాల‌కు సంబంధించిన ట్రైలర్లు, టీజర్లు పట్టించుకోకపోయినా పరవాలేదు.. కానీ ఈ ఎన్‌కౌంటర్‌ వార్తను మాత్రం అందరికీ తెలిసేలా చాటింపు వేయండి.. ట్రెండింగ్ చేయండి అంటూ ట్వీట్ చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.