వ‌ర్మ ఇదేం ఖ‌ర్మ‌.. ద‌య‌చేసి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పాలంటూ..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2020 2:51 PM GMT
వ‌ర్మ ఇదేం ఖ‌ర్మ‌.. ద‌య‌చేసి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పాలంటూ..

ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవ‌రికి తెలీదు. కాగా.. నేడు.. మంగ‌ళ‌వారం ఆయ‌న‌ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు తానే శుభాకాంక్ష‌లు చెప్పుకున్నాడు వ‌ర్మ‌. జైలులాంటి గ‌దిలో కూర్చొని కాళ్లు ఊపుతూ.. హ్యాపీ బ‌ర్త‌డే టూమీ అంటూ పాడ‌పాడుతూ.. త‌న‌కు తానే శుభాకాంక్ష‌లు చెప్పుకున్నాడు ఆర్జీవీ. ఈ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. 'పుట్టిన రోజున లాక్‌డౌన్‌లో ఒంట‌రిగా ఉండేలా చేసిన క‌రోనా వైర‌స్‌కు ధ‌న్య‌వాదాలు చెప్పిన వ‌ర్మ‌.. ద‌య‌చేసి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పండి' అని ట్వీట్ కూడా చేశాడు. దీన్ని చూసిన నెటీజ‌న్లు ఇదేం వ‌ర్రీ రా బాబు అని కొంద‌రు కామెంట్లు చేస్తుండ‌గా.. వ‌ర్మ తీరే వేరంటూ ఆయ‌న అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.నిత్యం వివాదాల్లో ఉండ‌డం రామ్‌గోపాల్ వ‌ర్మ‌కి త‌ప్ప మ‌రెవ‌రికి సాధ్యం కాదు. కాగా.. ఆదివారం ప్ర‌ధాన మంత్రి పిలుపు మేర‌కు దేశ ప్ర‌జ‌లంతా లైట్ దియా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించగా వ‌ర్మ మాత్రం సిగ‌రెట్ లైగ‌ర్‌ను వెలిగించి సిగ‌రెట్ కాల్చాడు. ఇదిలా ఉండ‌గా.. ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తొలిసారి సిగ్గుప‌డ‌డం చూశాన‌ని మ‌రో ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో అదితిరావు హైద‌రి, కార్తి జంట‌గా న‌టించిన సినిమా కాట్రు వెలియిదై తెలుగులో చెలియా. ఈ చిత్ర షూటింగ్ స‌మ‌యంలో మ‌ణిర‌త్నంతో అదితికి స్నేహాం ఏర్ప‌డింది. ఆసెట్‌లో అతిధి.. మ‌ణిర‌త్నానికి మోకాలిపై నిల్చుని రోజా పువ్వు ఇస్తున్న పోటో తాజాగా వైర‌ల్ అవుతోంది. దీనిపై వ‌ర్మ స్పందించాడు. సూప‌ర్ సీరియ‌స్ మ‌ణిర‌త్నం సిగ్గుప‌డుతూ ఉండ‌టాన్ని నేనెప్పుడూ చూడ‌లేదు. మొద‌టి సారి చూస్తున్న అంటూ కామెంట్ చేశాడు.,Next Story
Share it