హరతి హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు..!

By అంజి  Published on  11 Jan 2020 3:40 PM GMT
హరతి హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు..!

వరంగల్‌ అర్బన్‌: మరోక యువకుడితో చనువుగా వుంటున్న కారణంగా లష్కర్‌ సింగారం ప్రాంతానికి చెందిన మునిగాల హరతిని హత్య చేసిన నిందితుడు మహ్మద్‌ షాహిద్‌ ఆలియాస్‌ చోటును శుక్రవారం రాత్రి సుబేదారి పోలీసులు అరెస్టు చేసారు. ఈ హత్యకు సంబంధించిన విషయాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌ వెల్లడించారు. హత్యకు గురైన మృతురాలు హరతి, హత్యకు పాల్పడిన నేరస్థుడు మహ్మద్‌ షాహిద్‌ ఆలియాస్‌ చోటు (24) కాజీపేట్‌ విష్ణుపురి ప్రాంతానికి చెందినవాడిగా సీపీ తెలిపారు. నేరస్థుడి తండ్రి రజాక్‌, విష్ణుపురి ప్రాంతంలో మటన్‌ వ్యాపారం నిర్వహించేవాడు. నిందితుడు మహ్మద్‌ షాహిద్‌ 2016 హంటర్‌ రోడ్డులోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. నిందితుడు డిగ్రీ చదివే సమయంలోనే కళశాలలో లష్కర్‌ సింగారం ప్రాంతానికి చెందిన మృతురాలు మునిగాల హరతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కోద్దిరోజుల అనంతరం మృతురాలు మరియు నేరస్థుడి మధ్య స్నేహంగా మారడంతో పాటు, నేరస్థుడికి మృతురాలితో చనువు పెరిగి ఇరువురి మధ్య ప్రేమ చిగురించడంతో నేరస్థుడు, మృతురాలు హరిత ఇరువురు కోద్దికాలం కలిసి తిరిగారు.

నేరస్థుడు డిగ్రీ పూర్తి చేయడంతో గత ఆరునెలల క్రితం బ్యాంక్‌ ఉద్యోగాల కోచింగ్‌ తీసుకుంటునట్లుగా చెప్పి హన్మకోండలోని రాంనగర్‌ (క్రాంతినగర్‌) ప్రాంతంలో ఒక గదిని అద్దెకు తీసుకోని గదికి అప్పుడప్పుడు వచ్చిపోతుండే వాడు. ఇదే గదికి హరతి కుడా అప్పుడప్పుడు వస్తుండేది. కొద్ది రోజుల క్రితం హరతికి శివనగర్‌ ప్రాంతానిని చెందిన సుకుమార్‌ అనే యువకుడితో పరిచయం అయింది. దీనితో గత కోద్ది రోజుల నుండి మృతురాలు నేరస్థుడితో గతంలో మాదిరిగా చనువుగా ఉండకపోవడంతో అనుమానం కలిగిన నిందితుడు షాహిద్‌ మృతురాలిని పలుమార్లు ప్రశ్నించాడు. నీతో తప్ప మరేవరిని ప్రేమించడంలేని, నిన్నే ప్రేమిస్తున్నానని మృతురాలు హరతి నేరస్థుడైన షాహిద్‌కు తెలిపింది. రెండు రోజుల క్రితం మృతురాలు సుకుమార్‌కు సెల్‌ఫోన్‌ ద్వారా మేస్సేజ్‌లు పంపడాన్ని గమనించిన నేరస్థుడు మృతురాలు హరతిని గట్టిగా అడగడంతో మృతురాలని నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో, నిందితుడు మరో యువకుడైన సుకుమార్‌ ఇంటి చిరునామా కనుగోని అతని ఇంటి వెళ్ళి అతనిని ప్రశ్నించడంతో తాను మృతురాలు హరతిను ప్రేమిస్తున్నట్లుగా చెప్పాడు. ఇదే విషయమైన నిందితుడు షాహిద్‌ హరితను గట్టిగా ప్రశ్నించడంతో.. హరిత సుకుమారును ప్రేమిస్తున్నట్లుగా తెలపడంతో ఆగ్రహనికి లోనైన నిందితుడు హరితను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

హత్య చేయాలని ప్లాన్‌..

నిందితుడు షాహిద్‌ హరితను హత్య చేయాలనే రూపోందించుకున్న ప్రణాళికలో భాగంగా.. తనను కలవాలని హరతిని షాహిద్‌ కోరాడు. దీంతో నయీంనగర్‌లోని మూడు చింతల ప్రాంతంలో నిందితుడు షాషిద్‌ను కలుసుకుంది. కోద్దిసేపు మాట్లాడుకుందామని నిందితుడు షాహిద్‌ మృతురాలు హరితను తన ద్వీచక్రవాహనంపై రాంనగర్‌ ప్రాంతంలో అద్దెకు గదికి తీసుక వెళ్ళాడు. ఈ విధంగా నిందితుడి గదికి వచ్చిన హరతి, నిందితుడి మధ్య మాట మాట పెరిగిపోవడంతో పాటు తనను మరిచిపోమ్మని, తాను సుకూమార్‌ను వివాహం చేసుకుంటానని మృతురాలు నిందితుడితో ప్రాధేయపడింది. దీనితో అప్పుడు నిందితుడు నమ్మినట్లుగా నమ్మకంగా నటించి మృతురాలు హరతిను మోసపూరితంగా లొంగదీసుకోని శారీరకంగా కలిసిన అనంతరం నిందితుడు మృతురాలు హరతి తనకు దక్కదనే అక్కసుతో కక్షపూర్వకంగా నిందితుడు షాహిద్‌ తన దగ్గర వున్న కీచైన్‌ కత్తితో హరతిని గోంతుకోసి హత్యకు పాల్పడ్డాడు.

హత్య అనంతరం నిందితుడు గదికి తాళం వేసి రక్తపు మరకలతో విష్ణుపురిలోని తన ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకోని, హత్యకు ఉపయోగించిన కత్తిని ఇంటిలోనే ఉంచాడు. అనంతరం హరతిను హత్య చేసి నేరుగా వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు చేరుకున్నాడు. జైలు అధికారులు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోవాలని తెలపడంతో.. సుబేదార్‌ పోలీస్‌స్టేషన్‌లో హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it