ఆమె ఎవరో నాకు తెలియదు.. జడ్జి ముందు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి

By సుభాష్  Published on  26 Dec 2019 4:01 PM GMT
ఆమె ఎవరో నాకు తెలియదు.. జడ్జి ముందు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి

హత్యచారాలు, హత్య కేసుల్లో నిందితుడైన శ్రీనివాస్‌రెడ్డిపై విచారణ కొనసాగుతోంది. గురువారం విచారించిన ఫోక్సోప్రత్యేక న్యాయస్థానం జనవరి 3కు వాయిదా వేసింది. మనీషా కేసుకు సంబంధించిన 29 మంది సాక్ష్యులు ఇచ్చిన వాగ్మూలాన్ని నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి న్యాయమూర్తి వినిపించారు. కానీ నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి జడ్జి పలు ప్రశ్నలను అడుగగా, అందుకు తెలియదు అనే సమాధానాలే వచ్చినట్లు తెలుస్తోంది. కోర్టులో జడ్జి ప్రశ్నలు అడుగుతుండగా, శ్రీనివాస్‌ రెడ్డి ముఖంలో ఎలాంటి ఆందోళన, భయంగా కనిపించనట్లు తెలుస్తోంది.

మోబైల్లో ఫోర్న్‌ వీడియోలు చూస్తావా నువ్వు అని అడగగా, తన వద్ద ఆండ్రాయిడ్‌ ఫోన్‌ లేదని చెప్పుకొచ్చాడు శ్రీనివాస్‌రెడ్డి, కర్నూలు జిల్లాలో సూవర్ణ హత్యతో నీకేమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించగా, అసలు సువర్ణ ఎవరో తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ బాలిక దుస్తులపై ఉన్న రక్తపు మరకలు, స్పెర్మ్‌ ఆనవాళ్లు ఫోరెన్సిక్‌ పరీక్షల్లో నీదేనని తెలిందని, దీనికి నువ్వేమంటావని ప్రశ్నించగా, ఎస్‌ఓటీ పోలీసులే వాటిని దుస్తులపై సిరంజిలతో చల్లారని సమాధానం చెప్పినట్లు సమాచారం. హత్య జరిగిన రోజు తన ఫోన్‌ స్విచ్చాఫ్‌లో ఉందని, అందుకే టవర్‌ లోకేషన్‌ ఆ ప్రాంతం చూపించిందని చెప్పుకొచ్చాడు. ఈ కేసులో సాక్ష్యులుగా తన అమ్మ, నాన్నలను తీసుకువాలని నిందితుడు జడ్జిని కోరినట్లు తెలుస్తోంది.

Next Story