సికింద్రాబాద్ ప్యారడైజ్ బిర్యానీలో వెంట్రుక..లక్ష జరిమానా..!

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 17 Oct 2019 7:02 PM IST

 సికింద్రాబాద్ ప్యారడైజ్ బిర్యానీలో వెంట్రుక..లక్ష జరిమానా..!

హైదరాబాద్‌: సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ హోటల్ కు లక్ష రూపాయల జరిమాన విధించారు జీ.హెచ్.ఎం.సి అధికారులు. బిర్యానీలో వెంట్రుకలు వచ్చాయని బిర్యానీ ప్రియుడు ఫిర్యాదు చేశాడు. వెంట్రుక వచ్చిందని ఫిర్యాదు చేస్తే..హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందని కస్టమర్ చెప్పారు. దీంతో..హెల్త్, శానిటేషన్ అధికారులతో సహా, ఫుడ్ ఇన్ స్పెక్టర్ రంగంలోకి దిగారు. వంట గదిలొ శుభ్రత లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. లక్ష రూపాయాల జరిమానతోపాటు నోటీసులు ఇచ్చారు అధికారులు. వారం రోజుల్లోగా శుభ్రత పాటించకపోతే హోటల్‌కు తాళం వేయాల్సి వస్తుందని ప్యారిడైజ్ యాజమాన్యాన్ని అధికారులు హెచ్చరించారు.

6f286db3 C65f 4a44 B1b4 8ce4fd5f0cea

Next Story