జో బైడెన్‌ రాకతో లక్షలాది మంది భారతీయులకు మేలు జరగనుందా..?

By సుభాష్  Published on  8 Nov 2020 9:24 AM GMT
జో బైడెన్‌ రాకతో లక్షలాది మంది భారతీయులకు మేలు జరగనుందా..?

అమెరికా కొత్త అధ్యక్షునిగా పదవిని చేపట్టనున్న జోబైడెన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యంగా లక్షలాది భారతీయుల కస్టాలు, ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్‌ 1బీ వీసాలతో పాటు హై స్కిల్డ్‌ వీసాల సంఖ్యను ఆయన పెంచవచ్చని, అలాగే ట్రంప్‌ ప్రభుత్వం విధించిన ఆంక్షలు రద్దు చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్‌ పాలసీలను సైతం జో బైడెన్‌ సవరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

హెచ్‌ 1బీ వీసాలకు సంబంధించి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ లేదా విదేశీ భర్తలు, భార్యల వర్క్‌ పర్మిట్లను ఆయన ప్రభుత్వం పునరుద్దరించి గతంలో ఉన్న నిబంధనలను మార్చే సూచనలు కూడా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా యూఎస్‌లో ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది బారతీయ కుటుంబాలకు ఇది వరమనే చెప్పాలి. గ్రీన్‌ కార్డుల విషయంలోనూ జో ప్రభుత్వం కొత్త గైడ్‌ లైన్స్‌ని అమలు చేయవచ్చు. ఇమ్మిగ్రంట్లకు అనువుగా నగరాలు, కౌంటీలు కొత్త వీసాల కేటగిరిని సృష్టింలని జో బైడెన్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story
Share it