ఆ హీరోతో బ్యాట్మింట‌న్ స్టార్ 'న్యూ ఇయ‌ర్' సెల‌బ్రేష‌న్స్‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jan 2020 4:12 PM GMT
ఆ హీరోతో బ్యాట్మింట‌న్ స్టార్ న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌..!

బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఫోటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను గుత్తా జ్వాల ట్విటర్‌లో షేర్ చేసింది. అయితే ఇంత‌కు ముందు కూడా జ్వాలా వీరిద్ద‌రి ఫోటోలు ట్విట్ట‌ర్ లో షేర్ చేసింది. అప్పుడు వీరి మధ్య కాస్త గ్యాప్‌ ఉండేది.. కానీ ఈ ఫోటోల్లో గుత్తా జ్వాలకు విశాల్ ఏకంగా ముద్దు పెడుతుండ‌టం విశేషం.



అస‌లే సోష‌ల్ మీడియా ప‌క్షులు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని గుసగుసలాడుతున్నారు. ఈ ఫోటోలతో అది కాస్తా కన్ఫర్మ్ చేశారు. విష్ణు విశాల్ గ‌తంలో త‌న‌ భార్య రజనీతో విడిపోయాడు. వారు విడిపోవ‌డానికి జ్వాలనే కారణమంటూ ఓ విమ‌ర్శ రాగా.. జంట బాగుందంటూ మరికొంద‌రు కామెంట్స్‌ చేస్తున్నారు. వీరిద్ద‌రూ వేర్వేరుగా వారి జీవిత బాగ‌స్వాముల‌తో విడిపోయారు. విష్ణు విశాల్‌ గత జూన్‌లో తన భార్య రజనీతో విడిపోగా.. గుత్తా జ్వాల త‌న ప్రియుడు చేతన్‌ ఆనంద్‌తో విభేదాల కారణంగా విడిపోయింది.



Next Story