నవంబర్‌ 1న గురుకుల ప్రవేశ పరీక్ష

By సుభాష్  Published on  22 Oct 2020 1:55 PM GMT
నవంబర్‌ 1న గురుకుల ప్రవేశ పరీక్ష

గిరిజన గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది తెలంగాణ సర్కార్‌. ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ జనరల్‌ గురుకులాల్లో నవంబర్‌ 1న ఐదు తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గిరిజన గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి నాగార్జున రావు తెలిపారు.

ఇప్పటికే దరఖాస్తు చేసిన విద్యార్థులకు నబంబర్‌ 1 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని ఆయన అన్నారు. పరీక్షలు రాసే విద్యార్ధులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. సకాలంలో విద్యార్థులు పరీక్షకు హాజరు కావాలని వారు సూచించారు. కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

Next Story