హైదరాబాద్: తెగిపోయిన గుర్రం చెరువు
By సుభాష్ Published on 18 Oct 2020 3:45 AM GMTభారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలం అవుతోంది. గత వారం రోజుల నుంచి భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం జలదిగ్బంధమైంది. నిన్న సాయంత్రం నగరంలో మళ్లీ మొదలైన వర్షం పాతబస్తీ బాలాపూర్‌లో గుర్రం చెరువు కట్ట తెగిపోయింది. దీంతో హఫీజ్‌బాబా నగర్, ఫూల్ బాగ్, ఉమర్ కాలనీ, శివాజీ నగర్, రాజీవ్ నగర్ ప్రాంతాల్లోకి భారీగా నీరు ప్రవేశించింది.
బాబానగర్ సహా అనేక ప్రాంతాల్లోని ఇళ్లల్ఓకి వరదనీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో వరద ధాటికి వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. వరద నీటిని తతరలించేందుకు రెండు రోజుల కిందట అధికారులు గుర్రం చెరువుకు గండికొట్టారు. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి గుర్రం చెరువు నిండిపోయి నీరంతా బయటకు వచ్చేసింది.
Next Story