సిద్దిపేట జిల్లాలో కల్పుల కలకలం

By సుభాష్  Published on  7 Feb 2020 4:22 AM GMT
సిద్దిపేట జిల్లాలో కల్పుల కలకలం

సిద్దిపేట జిల్లాలో కల్పులు కలకలం రేపాయి. అక్కన్నపేటలో ప్రహరీగోడ విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం చోటు చేసుకుంది. సదానందం అనే వ్యక్తి గంగరాజు అనే వ్యక్తి ఇంట్లోకి ఏకే-47తో కాల్పులు జరిపాడు. దీంతో గంగరాజు కాల్పుల నుంచి తప్పించుకున్నాడు. కాల్పులు జరిపిన సదానందం అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కన్నపేటకు చేరుకున్నారు.

అయితే సదానందానికి ఏకే-47 ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. గ్రామంలో కాల్పులు చోటు చేసుకోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. కాల్పులకు గల కారణాలను పలువురిని అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిపిన సదానందం పరారీలోఉండగా, ఆయన కుటుంబీకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సదానందం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story
Share it