రూములోకి టీ తీసుకెళ్ల‌గానే త‌లుపులేస్తారు.. ఇలా ఒక్కొక‌రుగా రోజుకు 15 మంది..!

By రాణి  Published on  13 Feb 2020 12:55 PM GMT
రూములోకి టీ తీసుకెళ్ల‌గానే త‌లుపులేస్తారు.. ఇలా ఒక్కొక‌రుగా రోజుకు 15 మంది..!

దిండి పై మ‌త్తు పౌడ‌ర్ వేసి ముక్కుపై అదింపెట్ట‌గానే స్పృహ కోల్పోతాం. దాంతో వ‌చ్చినోడు ఎంత సేపైనా ఉండొచ్చు..ఎంత‌సేపైనా చేసుకోవ‌చ్చు. ఇలా సాయంత్రానికి 15 మంది వ‌చ్చిపోతుంటారు. మొద‌ట‌గా ఆఫీసులో డ్యూటీ చేసుకుని ఒక‌డొస్తాడు. వ‌చ్చీ రాగానే స్నానం చేసి బ‌ట్ట‌లు మార్చుకుని టీ తీసుకుర‌మ్మంటాడు. ప‌ని చేసేందుకు వ‌చ్చాం క‌నుక‌ పిలిచిన వెంట‌నే పోతా. టీ క‌ప్పుతో రూములోకి వెళ్ల‌గానే త‌లుపుకు గొళ్లెం పెడ‌తాడు. వాకిలేశాడంటే ఇక వాడితో ఉండి రావాల్సిందే. ఇక ఆ తీరున 15 మందితో గ‌డ‌పాల్సిందే.

ఇదీ, గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్లొచ్చిన‌ ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌హిళ దుర్భ‌ర అనుభవం. అనంత‌పురం జిల్లా క‌దిరి ప‌ట్ట‌ణానికి చెందిన ఓ మ‌హిళ దుబాయ్‌లో డ‌బ్బు సంపాద‌న ఎక్కువ‌గా ఉంటుంద‌ని స్థానికుల మాట‌లు విని, త‌న‌ కుటుంబ ఆర్థిక ప‌రిస్థితుల‌ను చ‌క్క‌బెట్టేందుకు విధిలేని ప‌రిస్థితుల్లో ఓ ఏజెంట్ ద్వారా గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్లొచ్చింది. అక్క‌డి తన అనుభ‌వాలను తెలుపుతూ క‌న్నీరు మున్నీరుగా విల‌పించింది.

గ‌ల్ఫ్‌లో వంట మ‌నిషిగా వెళ్లిన త‌న‌కు ఇంటి ఓన‌ర్‌, ఆయ‌న కొడుకు ఇద్ద‌రూ త‌న‌కు న‌ర‌కం చూపించారు. తండ్రీ, కొడుకులు ఇద్ద‌రికీ తెలిసే త‌న‌తో శృంగారం జ‌రిపారు. వాళ్లిద్ద‌రే కాక వారి కుటుంబ స‌భ్యుల్లోని మ‌గ పిల్ల‌ల‌తోనూ శృంగారం చేయిస్తారు. మొద‌ట ఇంటి ఓన‌రు కొడుకొస్తాడు. వాడొచ్చి వెళ్లిపోయాక గంట త‌రువాత ఇంకొక‌డొస్తాడు. వాడు వ‌చ్చీ రాగానే నీళ్లు పోసుకుని బ‌ట్ట‌లేసుకుని రూములోకి టీ తీసుకుర‌మ్మంటాడు. అలా రూములోకి వెళ్ల‌గానే త‌లుపుకు గ‌డియ పెట్టేస్తారు. అమ్మా అని అరిచినా వ‌దిలిపెట్ట‌రు. అరిచినా కానీ విడిచిపెట్టింది లేదు. నూనె పూసుకుని, ఇది చేసుకుని, అలాంటివ‌న్నీ చెప్తే మానం పోతుంది.

అలా గ‌ల్ఫ్ లో నాలాంటి క‌ష్టాలు మ‌రెవ్వ‌రు ప‌డ‌కుండా ఉండేందుకు ఇళ్లుళ్లు తిరిగి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నా. గ‌ల్ఫ్ దేశాల్లో క‌ష్టాలు ప‌డ‌తారు. బాధ‌లు ప‌డ‌తారు. నాలాంటి ఆడ‌వారే మీరు కూడా అని చెప్తున్నా. ప‌ది రూపాయ‌ల కూలీ వ‌చ్చినా ప‌ర్వాలేదు ఎంగిలి ప్లేట్‌లు క‌డుక్కొని ఇక్క‌డే బ‌తుకుదాం అని అక్క‌డి ప‌రిస్థితులు చెప్పి గ‌ల్ఫ్‌కు వేళ్లే వారిని చాలా మందిని ఆపేశా అంటూ చెప్పుకొచ్చింది ఈ గ‌ల్ఫ్ మ‌హిళా బాధితురాలు.

Next Story