ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
By సుభాష్ Published on 4 April 2020 10:19 AM ISTగుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం శనివారం ఉదయం సురేందర్‌నగర్ జిల్లాలో జాతీయ రహదారిపై జరిగింది. వేగంగా వెళ్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగంగా ఢీకొట్టడంతో లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Next Story