నీ బాగోతం నాకు తెలీదనుకుంటున్నావా ? వధువుపై ప్రతీకారం తీర్చుకున్న వరుడు

By రాణి  Published on  2 Jan 2020 11:47 AM GMT
నీ బాగోతం నాకు తెలీదనుకుంటున్నావా ? వధువుపై ప్రతీకారం తీర్చుకున్న వరుడు

వారిద్దరూ కొత్త దంపతులు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న వరుడు అవకాశం కోసం ఎదురచూశాడు. పెళ్లయ్యాక ఏర్పాటు చేసిన ఫంక్షన్ లో వరుడు వధువుపై దారుణంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. మా ఇద్దరి ప్రేమాయణం ఎలా సాగిందో..ఈ వీడియోలో చూడండి అంటూ ఫంక్షన్ కు వచ్చిన బంధువులు, ఫ్రెండ్స్ అంతా ఉండగానే తెరపై వీడియో ప్రసారమయింది. అది చూసిన వధువు సహా అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వరుడి చెల్లెలి భర్తతో వధువు ఏకాంతంగా ఉన్నట్లుగా ఉంది ఆ వీడియో. తెర వెనుక బాగోతం నడుపుతూ మోసం చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించాడు.

‘ఈ బాగోతం నాకు తెలీదనుకుంటున్నావా అంటూ వరుడు ప్రశ్నించడంతో ఆమెకు నోట మాట రాలేదు. చేతిలో ఉన్న పుష్ఫగుచ్చాన్ని వరుడిపై విసిరేసి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే వధువు బంధువులు మాత్రం ఆమె ఏకాంతంగా గడపలేదంటున్నారు. వరుడి చేతిలో గృహహింసకు గురైన వధువు అతని చెల్లెలి భర్త సాంగత్యంలో స్వాంతన పొందిందని చెప్పుకొచ్చారు. వరుడి ప్రతీకార చర్యపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story