హైదరాబాద్: దేశభక్తి ఉన్న వారు దేశానికి ఏదో రకంగా సేవ చేస్తూనే ఉంటారు. దీనిలో భాగంగానే.. ఓ కిరాణా షాపు యజమాని తన దేశభక్తిని చాటుకున్నాడు. తానూ..జీవిత కాలం పొదుపు చేసిన మొత్తం రూ.50 లక్షలను భారత సాయుధ దళాల నిధికి విరాళంగా ఇచ్చాడు.

హుజూర్ నగర్‌కు చెందిన శ్రీపురం విశ్వనాథం (78) చిన్నప్పట్నుంచీ దేశం కోసం ప్రత్యేకంగా డబ్బులను పొదుపు చేశాడు. తాను బతికి ఉన్నప్పడే ఆ డబ్బును సాయుధ దళాల సంక్షేమం కోసం అందజేయాలనుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని రాజ్ భవన్‌లో మంగళవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందజేశారు. సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ పేరుతో రూ.50 లక్షల చెక్కును గవర్నర్‌కు అందజేసి.. విశ్వనాథం అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story